X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 9:19 am IST

Menu &Sections

Search

రుద్రమదేవి స్నానించింది ఇక్కడే..

రుద్రమదేవి స్నానించింది ఇక్కడే..
data-page-url= 'http://www.apherald.com'
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు రెండవ కుమార్తె రుద్రమదేవి ఇరవైఏడేళ్ళ పాటు అప్రతిహతంగా పాలన సాగించిన కాలంలో, సాయంత్రపు వేళ, రాణీ రుద్రమ మారువేషంలో కోట నుండి మెట్ల బావి దగ్గరకు వచ్చి జలక్రీడలు ఆడి అక్కడే ముస్తాబు అయ్యేదని ఈ మెట్లబావి చుట్టూ ఉన్న కథనం. ఆమె స్నానించిన బావి ఇప్పటికీ ఉంది.

వరంగల్‌ కోట వెలుపల ఉన్న పురాతన మెట్లబావి అది. దానిని 'అంతస్తుల బావి' గా కూడా పిలుస్తారు. ఈ బావి కాకతీయ శైలిలో నిర్మాణమై, చతురస్రాకారంగా ఉంటుంది. అనేక అంచెలుగా మెట్లు ఉంటాయి ఒక వరుసలో శైలికీ మరో వరసలో శైలికీ వైవిధ్యం ఉంటుంది. చుట్టూ ఉండే వేదిక మీద కాకతీయ శైలి శిల్పాలతో స్తంభాలుంటాయి. ఈ స్తంభాలు చూస్తే , కోటమీద శత్రువుల దాడి చేసినపుడు ధ్వంసం చేసి ఇక్కడ వదిలేసినట్లుగా ఉంటుంది. దక్షిణం వైపు స్తంభం మీద అర్దచంద్రుడు ఉంటాడు. అలాగే భరత నాట్య నృత్య భంగిమల్లో శిల్పాలుంటాయి. బావి చుట్టూ అంతస్తులుంటాయి, కొన్ని శిథిలమయ్యాయి, అయితే ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ ఇటీవలనే బావిని పునరుద్దరించింది. రుద్రమ శింగారించుకోవడానికి వచ్చేది కాబట్టి దీనిని శింగార బావి అని కూడా పిలుస్తారని స్దానికులు అంటారు. 

చరిత్రకు సాక్ష్యంగా ... 

'' కాకతీయులు, నిజాంల కాలంలో, నిర్మించిన వందలాది ఈ మెట్లబావుల చుట్టూ చరిత్ర అల్లుకొని ఉంది. గత వైభవానికి, వాస్తు శిల్ప నైపుణ్యానికి సాక్ష్యంగా ఉన్న ఈ బావులు కాల క్రమంలో కళావిహీనంగా మారుతున్నాయి. అందుకే వీటిలో కొన్నింటిని గుర్తించి ' ఫర్‌గాటన్‌ స్టెప్‌ వెల్స్‌ ఆఫ్‌ తెలంగాణ' పేరుతో డాక్యుమెంట్‌ చేస్తున్నాం.''అని చెప్పారు 'హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరం'కి చెందిన యశ్వంత్‌ రామ్మూర్తి. 


5/ 5 - (1 votes)
Add To Favourite
  • రుద్రమదేవి స్నానించింది ఇక్కడే..

    రుద్రమదేవి స్నానించింది ఇక్కడే.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు రెండవ కుమార్తె రుద్రమదేవి ఇరవైఏడేళ్ళ పాటు అప్రతిహతంగా పాలన సాగించిన కాలంలో, సాయంత్రపు వేళ, రాణీ రుద్రమ మారువేషంలో కోట నుండి మెట్ల బావి దగ్గరకు వచ్చి జలక్రీడలు ఆడి అక్కడే ముస్తాబు అయ్యేదని ఈ మెట్లబావి చుట్టూ ఉన్న కథనం. ఆమె స్నానించిన బావి ఇప్పటికీ ఉంది. వరంగల్‌ కోట వెలుపల ఉన్న పురాతన మెట్లబావి అది. దానిని 'అంతస్తుల బావి' గా కూడా పిలుస్తారు. ఈ బావి కాకతీయ శైలిలో నిర్మాణమై, చతురస్రాకారంగా ఉంటుంది. అనేక అంచెలుగా మెట్లు ఉంటాయి ఒక వరుసలో శైలికీ మరో వరసలో శైలికీ వైవిధ్యం

More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.